విద్యుత్‌ వైర్లు తెగిపడి ఇద్దరు విద్యార్థుల మృతి

నల్గొండ, జనంసాక్షి: నల్గొండ జిల్లా  కోదాడ మండలం తొగర్రాయిలో తెగిపడిన11 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు నిన్ను రాత్రి గాలివానకు విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఇవాళ ఉదయం బహిర్బూమికి వెళ్లిన విద్యార్థులకు ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్‌ వైర్లు తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు పదవతరగతి చదువుతున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి తెగిపడిన వైర్లను సరిచేస్తే ఇంత ఘోరం జరిగిఉండేది కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు