విద్యుత్ వైర్లు తెగిపడి వ్యాక్తి మృతి
మెదక్, మార్చి9(జనంసాక్షి): ఉత్సాహంగా బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్‌ఘాతానికి గురై మరణించిన విషాద ఘటన మెదక్ జిల్లాలోని కోహిర్ మండలంలో జరిగింది. నగరానికి చెందిన సాదక్‌అలీ అనే యాభై ఐదేళ్ల వ్యాపారి సోమవారం బంధువుల ఇంట వేడుకల్లో పాల్గొనేందుకు ఫంక్షన్‌హాల్‌కు వెళ్లాడు. ఫంక్షన్‌లో పాల్గొని బంధుమిత్రులతో సరదాగా గడిపిన ఆయన ఫంక్షన్ హాల్ నుంచి రోడ్డుపైకి రాగానే అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి కరెంట్‌షాక్‌కు గురై మరణించాడు. గత రాత్రి వర్షం కురవడం, తెగిపడిన విద్యుత్ తీగల్లోకి పక్కనున్న స్థంభం నుంచి విద్యుత్ ప్రసారం జరగడంతో సాదక్‌అలీ విద్యుత్‌ఘాతానికి గురై మరణించాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు