విద్యుత్ ఉద్యోగులు పి ఆర్ సి అమలులో నిర్లక్ష్యానికి నిరసిస్తూ నల్ల బ్యాడ్జీ లతో నిరసన
గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 28 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు మంగళవారము పి ఆర్ సి అమలులో నిర్లక్ష్యానికి ఉద్యోగస్తులు నాలుగవ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల డివిజనల్ ఇంజనీర్ డి.లక్ష్మణ్ తోపాటు జెఏసి కో చైర్మన్ సంధ్య అశోక్, ప్రసాద్, భాస్కర్, నాగరాజు ,శ్రీరాములు, మహేష్, ఈదన్న, శ్రీయుక్త, సుప్రియ, విమల, రాధిక ,లక్ష్మి, గాయత్రి, రెహనా బేగం, సనత్ కుమార్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.