విద్యుత్ కొనుగోలుకు రూ.350 కోట్లు విడుదల చేసిన కేసీఆర్

హైదరాబాద్, (మార్చి 19): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో  విద్యుత్‌కోతలు నివారించేందుకు తక్షణం  విద్యుత్ ని కొనుగోలు చేయాలని అధికారులను గురువారం ఆదేశించారు. అందుకోసం తక్షణం రూ. 350 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ విద్యుత్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. రాష్టంలో  ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా  విద్యుత్ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు.  విద్యుత్‌ కొనుగోలుకు రూ.500 కోట్లు అవసరమని అధికారులు.. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు.  దీంతో ముఖ్యమంత్రి తక్షణం రూ.350 కోట్లు విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.