విధులకు హాజరైన సబిత ఇంద్రా రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసీలో సీబీఐ ఛార్జిషీటులో పేరే నమోదు తర్వాత సబిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నెల 8 నుంచి ఆమె విధులకు హాజరుకాలేదు. సీఎం సూచనతో సబిత విధులకు హాజరైనట్లు సమాచారం.