విభజన హావిూలను గాలికి వదిలేసిన కేంద్రం
హావిూలను ప్రస్తావించడంలో నేతల విఫలం
హోంమత్రి అమిత్ షాతో భేటీలో ప్రస్తావిస్తే మంచిది
అమరావతి,సెప్టెంబర్25 (జనంసాక్షి) విభజన సందర్బంగా ప్రస్తావించిన హావిూలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైన, ప్రధాని మోడీపైన ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఇదే అభిప్రాయడుతున్నాయి. ఆనాటి హావిూలను అమలు చేసి నిబద్దత నిరూపించుకుని ఉంటే ఇవాళ ఎపి ఉండేది. హోంమంత్రితో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సిఎంలతో ఆదివారం జరిగే చర్చలో పాల్గొనడానికి ఎపి సిఎం వైఎస్ జగన్ హాజరు కావడం లేదు. నిజానికి ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడం ద్వారా హావిూలపై ఎప్పటికప్పుడు గుర్తు చేస్తే మంచిది. ఇందులో అనేకానేక అంశాలను ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉడేది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో మాట ఇచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ పదేళ్లు ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. అయితే… 14వ ఆర్థిక సంఘం సిఫారసులను నెపంగా చూపించి హోదా ఇవ్వలేమని ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ వాగ్దానాన్ని కేంద్రం ఉల్లంఘించిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి రాష్ట్ర విభజనను సీమాంధ్రులు కోరుకోలేదు. తమకు జరిగిన నష్టం పట్ల ప్రజలు ఎంతో భావోద్వే గానికి గురయ్యారు. తమను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని వారు భావిస్తున్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఇచ్చిన హావిూలకు, కాగ్ నివేదికలకు, సుప్రీం కోర్టు సలహాలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చును వెంటనే తిరిగి చెల్లించాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ పోలవరం నిధులకు సంబంధించి కూడా పేచీలు పెడుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కేంద్రం రూ.1500 కోట్లతో సరిపెట్టింది. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విషయంలోనూ కేంద్రం ఏపీ పట్ల వివక్ష చూపిందని విమర్శలు ఉన్నాయి. బుందేల్ ఖండ్‌కు రూ.4వేల చొప్పున తలసరి సహాయం ప్రకటించిన కేంద్రం… ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు రూ.408 మాత్రమే కేటాయించింది. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఏపీ శాసనసభా సీట్ల పెంపు, పన్ను వ్యత్యాసాల సవరణ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, వైజాగ్ ` చెన్నై పారిశ్రామిక సమాహారం, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, దుగరాజుపట్నం రేవు, అమరావతికి ర్యాపిడ్ రైలు రహదారి అనుసంధానం, గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం మొదలైన అంశాలు ఏడేళ్లుగా పెండిరగ్‌లో ఉన్నాయి. హోంమంత్రితో సమావే శాల సందర్భంగా ఈ అంశాలను ఏదోరకంగా ప్రస్తావనకు వచ్చేలా చేయాల్సి ఉంది.