విలాస్‌రావు దేశ్‌ముఖ్ చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో కన్నుమూత
చెన్నై: కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్ చెన్నైలో కన్ను మూసారు. కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. కొంత కాలంగా ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఈ రోజు పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 67సంవత్సరాలు ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మే26, 1945న మహారాష్ట్రలోని లాతూరులో జన్మించారు. ఆయన భార్య వైశాలి, కుమారులు అమిత్, రితేష్, ధీరజ్‌లు. వైశాలీ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద పల్సీ. లాతూరు నుంచి మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన ఆయన అంచలంచలుగా ఎదుగుతూ రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్రశాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ పార్లమెంటరీ ఫోరం ఉపాథ్యక్షులుగా ఉన్నారు.