విలేకరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలయ పూజారి..

చిలప్ చెడ్/29జులై/జనంసాక్షి :- శ్రావణమాసం ప్రారంభమైన  శుక్రవారం నాడు ఆదిశక్తి పరాశక్తి అయిన శ్రీ చిట్కుల్ చాముండేశ్వరి ఆలయంలో మహిళలు భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు చేసే పూజలను కవరేజ్ చేయడానికి వెళ్లిన స్థానిక పాత్రికేయులు పట్ల ఆలయ పూజారి తీవ్ర అసభ్యకర పదజాలలతో దూషిస్తూ అవమానపరిచారు శుక్రవారం ఉదయం శ్రావణమాసం మొదటి వారం అయినందున భక్తులు అమ్మవారికి ఓడిబియ్యాన్ని  సమర్పిస్తుండగా ఓ విలేఖరి వార్త ప్రచురిత నిమిత్తమై ఫోటో తీస్తుండగా మద్యం తాగి వచ్చి ఫోటోలు తీస్తున్నావ్ ఎందుకు అంటూ అవమాన పరచడం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు అనుమతితోనే ఫోటోలు తీస్తుండగా మోతిలాల్ శర్మ ఓ విలేకరికని చూడకుండా విచక్షణ రహితంగా వ్యవహరించడం ఆలయానికి విచ్చేసే భక్తుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు గోచరిస్తుంది ఆలయ ప్రాంగణాన్ని పరిశుద్ధంగా ఉంచడంలో చాముండేశ్వరి శాఖాయుక్త మండలి విఫలమైనదని గతంలో భక్తులు ఆవేదన వ్యక్తం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఆలయానికి విచ్చేసే భక్తుల పట్ల ఆలయ పూజారులు లింగ భేదం లేకుండా అసభ్యకర పదజాలలతో దూషించిన దాఖలాలు సైతం ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ ఆలయ అభివృద్ధి ముఖ్యంగా భావించి స్థానిక విలేకరులు సైతం అభివృద్ధికి కృషి చేయాలంటూ తమ తమ పత్రికల ద్వారా భక్తులను ఆకట్టుకునే విధంగా కథనాలు రాస్తుండగా ఇలాంటి పూజారిలు ఆలయంలో ఉంటే అభివృద్ధి క్షీణించడం మాత్రం ఖాయమని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రావణమాసం కార్తీక మాసంలో ఆలయానికి ఉమ్మడి మండలాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు ఈ మాసాలలో మౌలిక వసతులను కల్పించడంలో ఆలయ శాఖయుక్త మండలి విఫలం కావడంతోపాటు ఆలయ పూజారులు భక్తుల నుండి అందిన కాడికి కానుకల రూపంలో దోపిడీ చేస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు శ్రీ చాముండేశ్వరి ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో లేకపోవడంతో ప్రత్యేక పూజలు చేయడానికి విచ్చేసే ప్రజా ప్రతినిధులకు సైతం అవమాన పాలు కావడం పరిపాటిగా జరుగుతుంది. ఇప్పటికైనా విలేఖరిని విచక్షణారహితంగా అవమానపరిచిన  పూజారి మోతిలాల్ శర్మ పై శాఖయుక్త మండలి పై సైతం ప్రభుత్వం శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ విషయమై ఆలయ ప్రధానార్చకులు ప్రభాకర్ శర్మ,ఆలయ మేనేజర్ శోభన్ బాబును వివరణ కోరగా మోతిలాల్ శర్మ విలేకరిపై అసభ్య పదజాలంతో అవమానపరచడం బాధాకరమని ఇలాంటి తప్పిదములు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.