వివాదాస్పద ప్రొబేషనరీ పూజా ఖేడ్కర్‌ పై వేటు

` ఐఏఎస్‌ను రద్దు చేస్తూ యూపీపీిఎస్సీ ఆదేశాలు
` ఎలాంటి పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం
న్యూఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ పై అవినీతి ఆరోపణల వ్యవహారంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రొవిజినల్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక, భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్‌ చేసింది. ఈమేరకు అధికారులు బుధవారం ఆదేవాలు ఇస్తూ వివరాలు వెల్లడిరచారు. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఖేడ్కర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే, దీనికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌ పేర్కొంది. జులై 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించాం. కానీ, ఆమె ఆగస్టు 4 వరకు గడువు కావాలని కోరింది. ఇందుకు తిరస్కరించి.. జులై 30 వరకు అదనపు సమయం కల్పించాం. ఇదే చివరి అవకాశమని.. ఎలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టంచేశాం. కానీ, ఆమె గడువులోగా తమ సమాధానాన్ని సమర్పించలేదు. అందువల్ల సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌`2022లో ఆమె ప్రొవిజినల్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నాం. భవిష్యత్తులో కమిషన్‌ నిర్వహించే నియామక పరీక్షలు/ఎంపికలకు హాజరుకాకుండా శాశ్వతంగా డిబార్‌ చేస్తున్నాం అని యూపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్‌ పేర్కొంది. తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్‌/సంతకం, ఈ`మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడ్డారని వెల్లడిరచింది. ఈ క్రమంలోనే ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి.. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడవిూకి తిరిగి రావాలని ఆదేశించగా ఆమె అక్కడికి వెళ్లలేదు. మరోవైపు, చీటింగ్‌`ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ నిమిత్తం ఆమె ఇటీవల దిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఆగస్టు 1వ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.