వివిధ పార్టీల నుండి బిజెపిలోకి భారీ చేరికలు.
బొమ్మలరామారం, జనం సాక్షి బొమ్మలరామారం మండలం లోని ప్యారారం, యావపూర్,మునిరాబాద్, సోమాజిపల్లి, గ్రామాల నుండి సుమారు100 మంది కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు యువకులు వివిధ సంఘాల నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కషాయం కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం కాషాయమయం అవుతుందని అవినీతి టి.ఆర్.ఎస్ పార్టీని గద్దె దింపేంతవరకు బి.జె.పి.పార్టీ ప్రజల పక్షణ పొరుడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీ.జే.పి.జిల్లా ఓ.బీ.సీ.మోర్చా గీతసెల్ కన్వీనర్ తిరుమల కృష్ణ గౌడ్,ప్యారారం గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి,నాయకుల వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గుండ్ల గోపాల్ ,మోటే వెంకటేష్,వట్టిపల్లి గోపాల్, గుంటి నరసింహ యాదవ్, బోయినపల్లి రమేష్ నాయక్,చంద్రశేఖర్,సురేష్, నరేష్, మౌలాలి గౌడ్, అర్జున్,చింతల గోపాల్,శ్రీకాంత్, వేణు, రాజు, రాములు, మహేందర్,అఖిల్ గౌడ్, పాల్గొన్నారు.