విశ్వ బ్రాహ్మణ,విశ్వ కర్మ ఐక్య సంఘం నాయకులు తహశీల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లీ మండల కేంద్రం లో విశ్వ బ్రాహ్మణ,విశ్వ కర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు ఊదరి నర్సింహ చారీ అధ్వర్యంలో మండలం లోని వివిధ గ్రామాల నుండి విశ్వ బ్రాహ్మణ నాయకులు పాల్గొని జీ ఓ 69 ను రద్దు చేసి జీ ఓ 55 నీ కొన సాగించాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేసారు.అనంతరం విశ్వ బ్రాహ్మణ,విశ్వ కర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులకు మేలు చేస్తుంది అని చెప్పుకుంటూ విశ్వ బ్రాహ్మనుల కుల వృత్తులు నిర్వీర్యం చేసే విధంగా జి ఓ 69 నీ తీసుకొచిందని ఇది పూర్తిగా విశ్వ బ్రాహ్మణ కుల వృత్తులు నిర్వీర్యం చేసే విధంగా ఉందని అన్నారు అదే విధంగా పద్మ శాలి కులానికి ఇస్తున్నట్లు గా 50 సంవత్సరం లు నిండిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ పెట్టాలని జీవిత బీమా పథకం అమలు చేయాలని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ 2000 కోట్లతో ఏర్పాటు చేయాలని మండల కేంద్రం లో 20 ఎకరాల భూమి లో పరిశ్రమ లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మం లో మండల ప్రధాన కార్యదర్శి పాలోజు జగదీశ్వర చారీ,మండల కోషాదికారి బోగోజీ గంగాధర్ చారీ,మండల ఉపాధ్యక్షుడు నర్సింగోజీ నాగభూషనం , బొగోజీ భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.