వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించాలి
విఆర్ఏల మండల అధ్యక్షుడు మహేందర్,
ఖానాపురం జూలై 23జనం సాక్షి
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ ముట్టడికి ఈ కార్యక్రమానికి ఖానాపురం మండల వీఆర్ఏలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్లుగా గ్రామ రెవెన్యూ సహాయకుల ( వీఆర్ఏ) పే స్కేల్ ప్రకటించాలన్నారు. అర్హులైన వీఆర్ఏ లందరికీ పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలోమండల ప్రధాన కార్యదర్శి రవికుమార్ జిల్లా అధ్యక్షులు ఐలేష్,వీఆర్ఏలు సందీప్,స్వామి,సుదర్శన్, మాధవి,రజిత,సంధ్య,మౌనిక,యాకయ్య, గోవర్ధన్,సుధాకర్,శీను, తదితరులు తరలి వెళ్లారు
Attachments area