వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

 

 

 

 

 

 

కేసముద్రం సెప్టెంబర్ 3 జనం సాక్షి  / శనివారం మండల కేంద్రంలో హమాలీ,కూలి యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి శివారపు శ్రీధర్ హాజరై మాట్లాడుతూ…
41 రోజులుగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధికంగా దీక్షలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే వీఆర్ఏల ఉద్యమానికి తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు పూర్తిస్థాయిలో మద్దతునిస్తూ ప్రత్యక్షంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు .
కేసముద్రం మండలానికి లేబర్ ఆఫీస్ సమస్య తీవ్రమవుతున్న దృశ్య  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు తొర్రూరు పట్టణ కేంద్రానికి వెళ్లి లేబర్ కార్యాలయంలో జరగవలసిన పనులను పూర్తిస్థాయిలో జరుపుకోవడం తొర్రూర్ ఆఫీసులో వారికి సరైన సమయంలో సరైన పద్ధతిలో కార్మికులకు చెందాల్సినటువంటి బెనిఫిట్ లు సకాలంలో అందకపోగా కొందరికైతే రావలసినటువంటి బెనిఫిట్స్ అన్ని అందని దాక్షగానే మిగిలిపోతున్నాయని ఈ సమస్యలన్నీ కూడా లేబర్ కార్యాలయాన్ని  కేసముద్రం మండలంను తొర్రూరు డివిజన్ కేంద్రంలో కలపడం వలన ఈ ఇబ్బందులు కార్మికులు పడుతున్నారని అన్నారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ ఆఫీస్ దూరంగ కారణంగా వారికి రావలసిన బెనిఫిట్స్ సరైన సమయంలో నమోదు కాకపోవడం అక్కడికి వెళ్తే సరైనటువంటి పద్ధతిలో వారికి సహకారం లేకపోవడం ఇవన్నీ కూడా కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి వీటన్నిటి  దృశ్య లేబర్ కార్యాలయాన్ని కే సముద్రంలో ఏర్పాటు చేయాలి లేనట్లయితే మహబూబాబాద్ పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే సెప్టెంబర్ 20వ తేదీ నుండి లేబర్ కార్యాలయం సమస్య పైన దీర్ఘకాలిక ప్రత్యక్ష ఉద్యమాన్ని ఐ ఎఫ్ టి యు యూనియన్  చేపడుతుందని వారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బట్ట మేకల రాజు, కాసు సూరయ్య, చిట్ల సంజీవ, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, జిలకర బాబు, లింగాల రమేష్,ఎడెల్లి శ్రీను, భూక్య సూర్య, యాకూబ్ పాషా,భూక్య బిచ్చ, బాలు, యాకయ్య, మహంకాళి కృష్ణ, సమ్మయ్య, కిషన్, చిరంజీవి, బానోత్ నాగు, తదితరులు పాల్గొన్నారు.