వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
: ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
………………………… ……
నిర్మల్ బ్యురో, ఆగస్టు10 తమ న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం లక్ష్మణ్ చందా మండల కేంద్రములో దీక్షలు చేస్తున్న వీఆర్ఏ లకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, కేసీఅర్ ప్రభుత్వం మొత్తం రెవెన్యూ వ్యవస్థను నిర్విర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు, అటు వీఆర్వో, ఇటు వీఆర్ఏ ను ఆగం చేస్తున్నారని ఆరోపించారు.
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వీ అర్ఏ ల న్యాయమైన డిమాండ్ లను నెరవేరుస్తామని మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు నాందేదపు చిన్నూ,సరికెల గంగన్న, తదితరులు పాల్గొన్నారు
