వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివి

 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
కుల్కచర్ల, సెప్టెంబర్ 10 (జనం సాక్షి):
వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు మరవలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.కుల్కచర్ల మండల కేంద్రంలో శనివారం రజక సంఘం మండల అధ్యక్షులు టి.రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, బహుజన బిడ్డ (చాకలి చిట్యాల ఐలమ్మ ,37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ..భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సబ్బండ వర్గాలను కూడగట్టి కొంగు నడుము చుట్టిన ఏకైక మహిళ చాకలి ఐలమ్మని అన్నారు.ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడల్లో నడవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిచంద్ర, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి  రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్, పిఎన్ పిఎస్ వ్యవస్థాపకులు రాఘవేంద్ర గౌడ్, బొమ్మిరెడ్డి పల్లి సర్పంచ్  చాకలి ఆంజనేయులు,స్థానిక  ఎంపీటీసీ ఆనందం, జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగ్య  నాయక్, బిజెపి జిల్లా యువ నాయకులు లక్ష్మీకాంత్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాంలాల్,పరిగి ఎంఈఓ హరిచందర్ నాయక్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు గాదె మైపాల్, ఉప సర్పంచ్ పాండురంగ చారి, రజక  సంఘం నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, వెంకటయ్య,రాములు, బాలరాజు, వెంకట్ రాములు, ఆంజనేయులు, గోపాల్, శీను, రాజు, తిరుపతి, భీమయ్య, గోపాల్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.