వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర : తెలంగాణ, కాంగ్రెస్ నేతల తీర్మానం
హైదరాబాద్: వీలైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం తెలుపుతామన్న షిండేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆందోళనలు తీవ్రమై అభివృద్థికి ఆటంకం కలగకముందే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి జానారెడ్డిని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కేవలం సమావేశాలే కాదని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సమావేశానికి హాజరు కాని వారిని కూడా సమన్వయం చేసుకోవాలని, వ్యతిరేక సంకేతాలొస్తే అందరం కలిసి కట్టుగా పోరాడదామని మాజీ మంత్రి దామోదరరెడ్డి అన్నారు. 18న జైపూర్ మేథోమథనం సమయంలో తెలంగాణకు అనుకూల సంకేతాలు వస్తాయని పాల్వాయి అభిప్రాయపడ్డారు. అఖిల పక్ష భేటీ వివరాలను ఈ సమావేశంలో సురేశ్‌రెడ్డి తెలిపారు.