వెంకటలక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే

 హరిప్రియవెంకటలక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే హరిప్రియటేకులపల్లి, ఏప్రిల్ 3( జనం సాక్షి): టేకులపల్లి మండలం ఆర్ సి  పేట గ్రామపంచాయతీకి చెందిన ఖాదర్ బాబు సోదరి వెంకటలక్ష్మి గత కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి గాయాల పాలయ్యారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ వారి స్వగృహానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఈసాల ఉపేందర్, దేవయ్య, ఎంపీటీసీ శాంతకుమారి, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, చీమల సత్యనారాయణ, పి ఆర్ కాలే, ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య, జాటోత్ నరేష్ నాయక్ తదితరులు ఉన్నారు.