వేడుకగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ భద్రాచల క్షేత్రంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య అభిజిత్‌ లగ్నాన సీతారాములవారికి వేదపండితులు మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి సీతారామచంద్రులకు ముత్యాలహారాలు సమర్పించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.