వేన్కేపల్లి లో పౌర హక్కుల దినోత్సవం. రెండంచెల పద్ధతి పై అవగాహన.. నాయబ్ తహసిల్దార్ మల్లేశం.

జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 30.. మండల కేంద్రంలోని వెన్కేపల్లి గ్రామంలో దళితవాడలో బుధవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయబ్ తహసిల్దార్ మల్లేశం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రెండంచెల పద్ధతి పై అవగాహన కల్పించారు.రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్ఐ శరత్ గౌడ్ మాట్లాడుతూ హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. హక్కులు ఎలా వినియోగించుకోవాలి, దళితుల భూ సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని ప్రతి దళిత బిడ్డ చదువుకోవాలని చదువుతూనే సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండోచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి జాక్కి తిరుమల, వార్డు సభ్యులు ఆంజనేయులు,గడ్డం శేఖర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.