వేళ్లు విరసిన సోదరీ..సోదరభావం…

డిఎస్పీ సిఐ పోలీసు సిబ్బందికిరాఖీ కట్టిన బిజేపి మహిళ నాయకులు.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు భారతీయ జనతా పార్టీ
జిల్లా మహిళా మోర్చ అద్యక్షురాలు సాహుశ్రీలత ఆద్వర్యంలో పట్టణ భారతీయ జనతా పార్టీమహిళా నాయకులతో కలసి బుధవారం డిఎస్పీ శేఖర్ గౌడ్ మరియు
పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి మరియు పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టి రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సోదరి సోదరభావానికి నిలువెత్తు నిదర్శనం రాఖీ పండుగ అన్నారు. చెల్లికి అన్న రక్ష బావాన్నితెలిపెది రక్షాబంధన్ అన్నారు. పట్టణ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి తాండూరు మున్సిపల్ ప్లోర్ లీడర్ అంతారం లలిత, లవణ్య ,మహిళలు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత,సెక్రటరీ రేణుకతదితరులు ఉన్నారు.