వేసవి సందర్భంగా నేటితో ముగిసిన విద్యాసంవత్సరం
హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు 2012-13 విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి జూన్ 11 వరకూ అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. వేసవి సెలవుల కారణంగా రాష్ట్రంలోని కోటిన్నర మంది పదిహేనేళ్ల లోపు పిల్లలు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వేసవి సెలవుల్లో డ్రాపవుట్లు నివారిస్తూ, కొత్త పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది.