వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌లోపు దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జీషీటు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది.
సెప్టెంబర్‌లోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్‌ కోసం పిటిషన్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించవచ్చని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌ కోరుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో సదీర్ఘ వాదనలు జరిగాయి.
సుప్రీకోర్టులో ఓ మాట, హైకోర్టులో ఓ మాట చెప్తూ సీబీఐ కేసును తప్పుదోవ పట్టిస్తోందని జగన్‌ తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించాయి. సీబీఐ మాత్రం కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, ఈ పరిస్థితుల్లో బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని వాదించింది. గతేడాది మే 27న సీబీఐ… వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసింది.