వైకాపా అసలు రంగు బయటపడింది : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
ఢిల్లీ : అస్పష్టమైన ప్రకటనతో వైకాపా అసలు రంగు బయటపడిందని, వైకాపా తెలంగాణకు బద్థ వ్యతిరేకి అని తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రణబ్‌కి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని తెదేపా ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. తెరాస బంద్ పిలుపు విరమించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కోరారు. నెలరోజుల గడువులో అన్ని పార్టీలు కలిసికట్టుగా మాట్లాడుకుందామని, నెలరోజులు ఓపిక పట్టాలని, రేపటి బంద్‌పై పునరాలోచించుకోవాలని వారు సూచించారు. నిర్మాణాత్మక పద్ధతిలో అఖిలక్షం నిర్వహించినందుకు షిండేకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాలకు అనుకూలమని షిండే సమావేశంలో స్పష్టంగా చెప్పారని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ సాధనకు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలియజేశారు.