వైద్యురాలి గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జూలై 22( జనం సాక్షి)
విధులకు సక్రమంగా హాజరుకాని వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు శుక్రవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ* చేశారు.ఆస్పత్రి సిబ్బంది పని విధానాలను, రిజిస్టర్ లను  పరిశీలించారు. గత మూడు రోజులుగా ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతూ.కాళీగా ఉన్న రిజిస్టర్ ను చూసి వాపోయారు.సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉండటం తగదని, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి తో ఫోన్ లో మాట్లాడి పనిచేయని వైద్యు రాలి పై చర్య తీసుకోవాలని ఆదేశించారు.ఆస్పత్రిలో మందులను పరిశీలించారు. వర్షాకాలం సందర్బంగా వాతావరణం మార్పులతో. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని  వైద్యశాఖ వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ ఎంపీపీ వసంత వెంకట్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ  వైస్ చైర్మన్ డి లక్ష్మయ్య ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.