వైద్యులు శేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు ఆగస్టు 17 (జనం సాక్షి) పట్టణ వైద్యులు శేఖర్ కుటుంబానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతూ గత వారం రోజుల క్రితం అకాల మరణం చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బుధవారం ఆయన నివాసానికి చేరుకుని వైద్యులు శేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు శేఖర్ తాండూర్ పట్టణంతోపాటు నియోజకవర్గ ప్రజలకు శేఖర్ వైద్య వృత్తిలో ఉత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరించే వైద్యులు శేఖర్ మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అదే విధంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,  తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, జిల్లా ప్రణాళిక మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, మసూద్, రఘు,అశోక్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, ఇర్ఫాన్, మరియు తదితరులు ఉన్నారు.