వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కమిషనర్‌ సూచన

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం ముగిసే వరకూ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇవాళ అని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా మలేరియా అధికారులు మున్సిపల్‌ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాదుల నివారణకు వస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని వాడడం, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ నీరు తొలగింపు తదితర అంశాలపై రానున్న 15 రోజుల్లో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అదేశించారు.