వైద్య ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ముత్యాల సునీల్ రెడ్డి
భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):బాల్కొండ మండలంలోని బుసాపూర్ గ్రామానికి చెందిన సాదుల సూర్య కు రెండు మూత్రపిండాలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.నిరుపేద కుటుంబానికి చెందిన సూర్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ విషయం తెలుసుకున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి వైద్య ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం పంపించారు. ఆ డబ్బులను సునీల్ యువసేన సభ్యులు గురువారం నాడు సూర్య కుటుంబానికి అందించారు.
Attachments area