వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
– డి ఎం అండ్ హెచ్ ఓ డా. వెంకటరమణ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 24(జనం సాక్షి)
తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ వరంగల్ మరియు హన్మకొండ జిల్లా కమిటీ ల ఆద్వర్యం లో “ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం” వేడుకలు వరంగల్ జిల్లా కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం డి. ప్రకాష్ రావు, జిల్లా కార్యదర్శి గారు అధ్యక్షతన ఘనంగా జరిగినవి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల డి. యం హెచ్. ఓ లు డా. కె. వెంకట రమణ, డా. బి. సాంభశివరావు మరియు జిల్లా ఔషధ నియంత్రణాధి కారి జన్ను కిరణ్ కుమార్ గారలు హాజరై మాట్లాడుచూ మానవాళి మనుగడకు ఔషధాలు అత్యవసరమని, అట్టి ఔషదాలు తయారు చేసే ఔషధ నిపుణులు ఫార్మాసిస్టు లని కొనియాడారు. వైద్య రంగం లో ఫార్మాసిస్టుల పాత్ర చాలా కీలకమని, కోవిడ్ పాండమిక్ లో వాక్సీన్స్ తయారు చేసి ప్రపంచం లో కోట్లాది మంది పేషంట్లను కరోనా బారినుండి కాపాడిన ప్రాణ దాతలు ఫార్మాసిస్టులు అని కొనియాడినారు.
రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బత్తిని సుదర్శన్ గౌడ్ మాట్లాడుచూప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని అన్ని దేశాల్లో 25సెప్టెంబర్ రోజున ప్రతి సంహత్సరం ఘనంగా జరుపుకుంటారని, మన దేశం లో కూడా వేడుకలు జరుపుకోవాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్కులర్ జారీ చేసిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం… గౌరవ ముఖ్య మంత్రి గారు కళలు కనే ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేరాలంటే వైద్య రంగం లోని ఫార్మసిస్టుల సేవలను సరియైన రీతిలో వినియోగించుకున్నట్లైతే పేషంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. మానవ మనుగడకు ఔషధాలు అత్యవసరం, ఔషధ నిపుణులు ఫార్మాసిస్టులు. మన రాష్ట్రం లో ఫార్మసీ ఆక్ట్ 1948, సెక్షన్ 42ని తూ. చ. తప్పకుండా అమలు చేసినట్లయితే ఆరోగ్య తెలంగాణ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని అన్నారు అలాగే
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పాండమిక్ ని పారదోలడానికి వాక్సిన్ అభివృద్ధి చేసి, ప్రభుత్వాలచే ఆమోదింప చేసి, ఆసుపత్రుల ఫార్మాసిస్ట్స్ ద్వారా ప్రపంచం లోని కోట్లాది మంది పేషంట్ల ప్రాణాలను కాపాడటంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ సైన్టిస్టులు, కమ్యూనిటీ ఫార్మాసిస్టులు, ఆసుపత్రుల ఫార్మాసిస్టులు అన్ని రకాల మందులు, వాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరంత రాయంగా కస్టపడి పని చేసి ఆసుపత్రులకు వాక్సిన్లు పంపిణీ చేసి ప్రజలను కోవిడ్ భారీ నుండి కాపాడినారని,
అంతర్జాతీయ ఫార్మసీ ఫెడరేషన్ కూడా పాండమిక్ సమయాల్లో ఫార్మసిస్టుల పాత్ర ఎలా ఉండాలనే ఒక రూప కల్పన చేయబోవుచున్నారని అ న్నారు.
ఫార్మసిస్టుల సేవలను “ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ ప్రొవైడర్ “గా బాగా విస్తృత పరిచి వారి సేవలను వాడుకోవాలని “ప్రపంచ ఆరోగ్య సంస్థ “మరియు ప్రపంచ దేశాలు గుర్తించినవని, ఉదా : కోవిడ్ టెస్టులు చేయించుకోడానికి ఆసుపత్రి /ల్యాబ్ కు వెళ్ళాలి, ఆలా కాకుండా ఫార్మసీ లోనే టెస్టింగ్ ఫెసిలిటీ, డిసీజ్ ప్రివెన్షన్, వ్యాక్సినేషన్, ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ప్రిలిమినరీ టెస్టులు, హెల్త్ ఎడ్యుకేషన్ అన్నింటినీ ఫార్మసీ స్థాయిలోనే జరుపాలని ప్రజలకు శీఘ్రంగా అందుతాయనే అభిప్రాయానికి వచ్చిందని, ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్నీ గుర్తించినవని, కానీ భారత దేశం ఈ విషయం లో చాలా వెనుక బడి ఉందని, ముఖ్యం గా ప్రభుత్వాది నేతలు, ఉన్నతాధికారులు దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే కమ్యూనిటీ పార్మాసిస్టులకు ప్రభుత్వం నుండి లోన్ సౌకర్యాలతో అవకాశాలు ఇచ్చినట్లయితే జనరిక్ మందుల షాప్ లు వీరికే కేటాయించి నట్లైతే ప్రజలకు క్వాలిటీ సర్వీసెస్ అందుతాయన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మిగతా అన్ని క్యాడర్లు వారికి వారియొక్క క్యాడర్ స్ట్రెంగ్త్ పెచుతున్నారు. కానీ ఫార్మసిస్టుల క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచక పోవడం వల్ల ఉన్నవారి మీదనే పని ఒత్తిడి పడటమే కాకుండా నాణ్యమైన సేవలు కొరవడుచున్నవని, ఔషధ సంబంధమైన లోటు పాట్లకు దారి తీస్తుంది కాబట్టి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ముగ్గురు ఫార్మాసిస్టులను పెంచడం వల్ల 8గం. లకు ఒక్కరి చొప్పున పేషంట్లకు నాణ్యమైన సేవలు అందుతాయని,
ఫార్మ్. డి. చదివిన చాలా మంది ఫార్మాసిస్టులు ప్రయివేట్ సెక్టార్ లో, విదేశాలకు వెళ్లి వారి సేవలు అందిస్తున్నారు తప్ప మన ప్రభుత్వాలు వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నారు. .
ఉప్పు భాస్కర్ గారు మాట్లాడుచూ * ఉన్నత విద్య.. ఫార్మసీ కౌన్సిల్.. డిప్లమా చదివిన వారికి ప్రత్యేకించి బి. ఫార్మసీ ప్రాక్టీస్ రెండు సం. ల కోర్సు ప్రవేశ పెట్టిందని ఇక్కడ ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న వారికి ప్రభుత్వం స్టడీ లీవ్ ఇచ్చి బి. ఫార్మసీ చదువడానికి అవకాశం ఇస్తే వారి సేవల్లో నాణ్యత, వారి విజ్ఞానం పెరుగుతుందన్నారు.
బస్తీ దవాఖానాల్లో, పల్లె దవాఖానాల్లో మరియు ఎక్కడ ఔషదాలు ఉంటే అక్కడ తప్పని సరిగా ఫార్మాసిస్టు పోస్టులు మంజూరు చేసినట్లయితే సరియైన రీతిలో నాణ్యమైన వైద్య సేవలు పేషంట్లకు అందుతాయని పద్మజ దేవి గారు అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే ఫార్మాసిస్టులకు అతని సర్వీస్ లో కనీసం నాలుగు రకాల ప్రమోషన్లు ఇవ్వాలి. (ఇతర క్యాడర్లు వారికి ఇచ్చినట్లుగా ).
ఫార్మాసిస్టు లను ఫార్మసీ ఆఫీసర్స్ గా పేరు మార్చాలి.
ఫార్మాసిస్టు నియామకాల్లో కనీస విద్యార్హత బి. ఫార్మసీ ఉండాలి.
రాష్ట్ర స్థాయిలో సపరేట్ ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని
*** గౌరవ ముఖ్య మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు గారు ఫార్మసిస్టుల సేవలను గుర్తించి మా న్యాయ మయిన సమస్యలు పరిష్కరించినట్లైతే పేషేంట్లకు సరియైన రీతిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని డి. ప్రకాష్ రావ్ అన్నారు . తద్వారా ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నేరవేరుతుందని కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను సహృదయం తో అర్ధం చేసుకుని మా సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈసందర్భముగా ఉత్తమ సేవలు అందించిన వరంగల్ జిల్లా ఫార్మాసిస్టు ఏ. వెంకట రమణ ని మరియుహన్నకొండ జిల్లా ఫార్మాసిస్టు సునీత ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసారు.
ఈ సమావేశం లో డా. టి. మదన్మోహన్ రావు, డా. యాకుబ్ పాషా, ప్రోగ్రాం ఆఫీసర్ డా. సుమంత్ కుమార్, జిల్లా సుపవైజర్ పద్మజాదేవి, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఫార్మాసిస్టు ఉప్పు భాస్కర్ రావు, శైలజ, వెంకటస్వామి, వేణు, గోవర్ధన్, యం. అవినాష్, సతీష్, శ్రీదేవి, సూరయ్య, వెంకన్న, అంజయ్య, శ్రీదేవి, జాన్సీ, అజిత, విజిత, సుధారాణి, సృజన, అనూష, రమేష్, వరంగల్, హన్మకొండ జిల్లాల ఫార్మాసిస్టులు, . డెమో ఈదురు అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా, రామలింగయ్య, అనిశెట్టి రమేష్, రవీందర్ రెడ్డి, ఆఫిస్ సిబ్బంది చంద్రకళ, త్రివేణి, రాధిక,సుస్మిత, పర్వేజ్, మధు, తదితరులు పాల్గొన్నార