వైద్య సిబ్బంది కృషి వల్లే ఆస్పత్రికి కాయకల్ప అవార్డు.
రోగులను నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది బాధ్యతగా మెలగాలి.
తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజుకుమార్ కందుకూరి.
తాండూరు అగస్టు 17(జనంసాక్షి)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డాక్టర్ రవిశంకర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మేరుగైన వైద్యం అందించడమే కాకుండా నిరంతరం ఆస్పత్రి పర్యవేక్షణలో శుభ్రతలో సేవలందిస్తున్న డాక్టర్ రవి శంకర్ ను బుధవారం తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలో సన్మానించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి మాట్లాడుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా సేవలందిస్తూనందుకు ఆసుపత్రి సూపర్డెంట్ రవిశంకర్ ని వైద్యులను మరియు ఆస్పత్రి సిబ్బందిని ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆస్పత్రి వైద్యులు మరియు సిబ్బంది కృషి వల్లే గత నెల 92 శాతం తో కాయకల్ప అవార్డు రావడం కాకుండా 25 లక్షల రూపాయలు కూడా జిల్లా ఆస్పత్రికి రావడం చాలా సంతోషకరం అన్నారు. ముందు ముందు కూడా ఇలాగే వైద్యుల సేవలు నిరుపేదలైన రోగులకు అందించాలని ముఖ్యంగా ఆస్పత్రి సిబ్బంది రోగులను తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారిపట్ల సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ శుకుర్ నియోజకవర్గ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్ ,చంద్ర శేఖర్, గుండు, బీసీ నాయకులు సయ్యద్ మున్నా, సోనీ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.