వైద్య సేవలు అందకపోవడంతో ఒకరు మృతి..

నర్సంపేట (జనం సాక్షి)
నర్సంపేట ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. బాధితుల కథనం ప్రకారం నర్సంపేట మండలం చెందిన బానోత్ బద్రు అనే వృద్ధుడు గత మూడు రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని అమ్మ ఆస్పటల్ తీసుకురాగా వైద్య సేవలు పొందుతూ మృతి చెందారు. సంబంధించిన వివరాలను బాధిత కుటుంబ సభ్యులు విలేకరుల ముందు తమ గోడును వెళ్ళపోసుకున్నారు
నర్సంపేట లోని కొందరు వైద్యులు ధనార్జనే దేయంగా వైద్యం చేస్తున్నారు.. నర్సంపేట లోని అమ్మ హాస్పిటల్ లోని వైద్యులు నర్సంపేట మండలం బొజ్యనాయక్ తండ కు చెందిన బానోత్ భద్రు వయసు 70 తోంటి ఆపరేషన్ కోసం 3 రోజుల క్రితం వచ్చాడు. అతనికి ఆపరేషన్ చేయలని బాధిత కుటుంబ సభ్యులకు వివరించారు. వైద్య సేవల నిమిత్తం సేవలు చేస్తుండగా. హార్ట్ ప్రాబ్లెమ్ చాలా రిస్క్ రిపోర్ట్ వచ్చిందని సమచారం. ఇచ్చారు
ఆరోగ్యశ్రీ పథకం కింద అనుమతి రాగానే శనివారంసాయంత్రం 4 గంటలు ఆపరేషన్ చేసారు. కానీ రాత్రి పేషెంట్ గుండెపోటుతో మరణించాడు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పేషెంట్ వాళ్ల ఇంటికి పంపించడం తో కుటుంబం సభ్యులు డెడ్ బాడీతో హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. వైద్యుడు మాత్రం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. గుండె సమస్య ఉంది అని తెలిసి ఒక్క మత్తు డాక్టర్ సహకారంతో ఆపరేషన్ చేయడం వైద్యుల నిర్లక్ష్యానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు నిరసన తెలిపి వైద్యులతో సంప్రదించి సమస్య సద్దుమణిగేలా ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.