వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం.
తాండూరు అగస్టు 19(జనంసాక్షి)శ్రీ కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ, గోపికల వేషధారణతొ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. పోటీ పడి రాధాకృష్ణులు పెరుగుతో కూడిన కుండని పగలగొట్టారు.కార్యక్రమంలో నేర్చుకుంటున్నప్ప టికి విద్యార్థులు దేశ సంస్కృతి, సంప్రదాయాల ను మరవకూడదని సూచించారు. విద్యార్థి దశ నుంచే గీతా శ్లోకాలను పఠించాలని పేర్కొన్నారు. అల్లరివాడు,శ్రీకృష్ణుని జన్మదిన ఉత్సవాలను ఆనవాయితీగా పాఠశాలలో జరుపుతున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా పాఠశాలల్లో అన్ని పండుగలను జరుపుటకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధె లక్ష్యంగా పాఠశాలలను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.