వైభవంగా శ్రీ అయప్ప స్వామికి మహా కుంభాభిషేకం
జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి మూల విరాట్ కి సహస్ర కలశ మహా కుంభాభిషేక మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ 15వ వార్షికోత్సవం పురస్కరించుకొని కేరళ చెందిన శ్రీసంజీవ్ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా శ్రీగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీశివ, శ్రీవిష్ణు శ్రీజ్ఞాన సరస్వతి, శ్రీప్రసన్నాంజనేయ, నవగ్రహ విగ్రహాలకు ధ్వజస్తంభానికి కేరళ తాంత్రిక విధానంలో ప్రత్యేక పూజలు, అర్చనలను చేసారు. ఆలయంలో వేదోక్తంగా హోమాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ అయ్యప్పస్వామి మూల విరాట్ కి 1008 జంటచే సహస్ర కలశపూజ, సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నా ప్రసాదాల వితరణ చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణ వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కొమురవెల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మల్క రామరావు, ఎరుకల పోచం, సహాయ కార్యదర్శి సింగారపు కిష్టయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్, కోశాధికారి కొంతం రమేష్, గుండా రాజు, వొడ్నాల మహేందర్, నీలం రమేష్, కాయితోజు సమ్మయ్య, సింగారపు కిష్టయ్య, నూకల శంకర్, మైఖెల్, నాగేంద్ర స్వామి, భద్రయ్య స్వామిలు పాల్గొన్నారు.