వ్యక్తిగత మరుగుదొడ్లకు సాయం

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని వినియోగించు కోవాలని డిఆర్‌డివో పిడి సూచించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ట్లు చెప్పారు. వీటి పురోగతిని ఎప్పటికప్పుడు కిందిస్థాయిలో అధికారులు తెలుసుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని స్వఛ్చతకు చేయూతను ఇవ్వాలన్నారు. మరుగుదొడ్లు లేని వారు తక్షణమే దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకున్నప్పటికీ వాటిని వినియోగించడం లేదని తెలిపారు. అధికారులు గ్రామాలను సందర్శించి ఆరు బయట మూత్ర, మల విసర్జన చేస్తే వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించి మరుగుదొడ్లను వినియోగించుకునేలా చేయాలన్నారు. బహిరంగ మూత్ర, మల విసర్జన ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.