వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి

వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు భూ పంపిణీ ఉపాధి కల్పించాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య
జిల్లా ఉపాధ్యక్షులు మండ రాజన్న
డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి
 రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర కేంద్ర చట్టం తీసుకురావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్వాల వీరయ్య జిల్లా ఉపాధ్యక్షులు మండ రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 28న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డోర్నకల్ మండల ఎనిమిదో మహాసభ అన్య గాని శ్రీనివాస్ రాజమణి గడ్డం నాగమ్మ అధ్యక్షతన డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో జరిగింది ఈ మాసభలో వీరయ్య మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో మూడు లక్షల పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని జిల్లాలో చిన్న మతితరః పరిశ్రమలు లేక వ్యవసాయంలో యాంత్రిక అన్న వల్ల పనులు దొరక్క పట్టణాలకు వలస పోతున్నారని అట్లాంటి వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలని 2016 జీవోను సవరించి రేట్లు పెంచి కొత్త జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్న ప్రభుత్వ బంజరాయి భూస్వాముల దగ్గర సీలింగ్ చట్టానికి మించి ఉన్న భూములను బయటకు తీసి పేదలకు సాగు భూములకు ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పెన్షన్స్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలు దళిత బంధు పేదలందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ మాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న సిఐటియు జిల్లా నాయకులు దాసరి మల్లేశం కెవిపిఎస్ మండల కార్యదర్శి పి వెంకట రాములు రైతు సంఘం మండల కార్య  దర్శి బొబ్బె వెంకటరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఉప్పనపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు అనంతరం 17 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది మండల అధ్యక్షులుగా ఉప్పనపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా అన్ని గాని శ్రీనివాస్ కుంభం ప్రభాకర్ రేఖ నరసింహారావు గాలి కేశవులు గడ్డం నాగమ్మ ఎనిమిది మందితో ఆఫీస్ బేరర్స్ మరో 9 మందితో కార్యవర్గం ఎన్నికయింది ఈ మాసభలో శశిరేఖ లక్ష్మి సరిత వెంకటమ్మ గురువయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area