వ్యవసాయ పొలంలో రైతులకు అవగాహన ఏవో అభినాష్ వర్మ

రాయికోడ్ జులై 20 జనం సాక్షి రాయికోడ్ మండలం నాగన్ పల్లి గ్రామం లోని విష్ణువర్ధన్ రెడ్డి అనే రైతుకు బీస్ బి యొక్క ప్రయోజనాలను వివరించి, 10 ఏకరాల విస్తీర్ణం కు బిస్ బి   ప్యాకెట్లను ఇవ్వడం జరిగింది……
బ్యాక్టో పీ (బీస్ బి  ) యొక్క ప్రయోజనాలు*
 ఇది భూమిలో మొక్క గ్రహించ లేని స్థితిలో ఉన్న బాస్వరాన్ని కరిగించి మొక్కకు లబ్య మయ్యే స్థితిలోకి మారుస్తుంది…..
 ఇది మొక్క ఎదుగుదలకు అవసరమయ్యే  హార్మోన్ల విడుదలకు దోహదపడి మొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది
 విత్తన శుద్ధి ద్వారా అయితే 5 గ్రాముల పొడిని 1 కేజీ విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి…..
భూమిలో అయితే 2-4 కేజీ ల భాక్టో పీ నీ 100 కేజీ ల సేంద్రీయ ఎరువు తో కలిపి చివరి దుక్కిలో తేమ ఉన్నప్పుడు ఒక ఏకరం పొలం చల్లుకోవాలి…..
జాగ్రత్తలు
ఏ ఇతర రసాయనాలతో కూడా ఈ ఒక్క పొడిని కలిపి వాడకూడదు
అదే విధంగా ఎరువులను దఫా దఫా లుగా వెయ్యాలి,డీఎపి   వాడకం ను తగ్గించాలి, దీని ద్వారా పెట్టుబడి వ్యయాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అని తెలిపారు
                 కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ ,గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డి ,గ్రామ రైతు బంధు కో ఆర్డినేటర్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్  విష్ణువర్ధన్ రెడ్డి ,సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి మల్లేశం మరియు పలువురు రైతులు పాల్గొన్నారు