వ్యవసాయ విద్యుత్ మోటర్లు అపహరణ
గ్రామ పంచాయతీ నర్సరీ సైతం వదలని దొంగలు…
కరెంటు బాధ తీరింది…మోటార్ల బాధ ఎట్లా…!
కొత్తగూడ సెప్టెంబర్ 23 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు రాత్రుళ్ళు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లకుండా రైతులకు ఎలాంటి ప్రమాదం,ప్రాణ నష్టం వాటిల్లకుండా రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుంటే…దానికి విడ్డూరంగా రైతులు రాత్రుళ్ళు వ్యవసాయ విద్యుత్ మోటార్ల కావాలి కాస్తున్నారు.రైతుల కన్నీళ్ళతో సొమ్ము చేసుకుంటున్న దొంగలు.వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ముండ్రాయిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ నర్సరీలోని 380 పిట్ల బోరు మోటారు,వైరు సైతం అపహరణకు గురైంది.దీనితో పాటుగా గ్రామంలో వ్యవసాయ విద్యుత్ మోటార్లను అపహరణ చేస్తున్న గజదొంగలు… రెండు మాసాల్లో ఐదు మోటర్లు పోవడం గమనార్ధం…నర్సరీ బోరు మోటర్ విషయంపై గ్రామ సర్పంచ్ భారతి కిషన్ ను వివరణ కోరగా మోటర్ పోయిన మాట వాస్తవమేనని సుమారుగా దాని ధర 40 వేల పైన ఉంటుందని వీటితో పాటుగా గ్రామంలో బానోత్ ఈర్య,దారావత్ చంద్రు,ఈక మల్లయ్య,భానోత్ ఈర్య ల వ్యవసాయ విద్యుత్ మోటర్లు అపహరణ కు గురికావడం జరిగిందని,ఒక్కొక్క వ్యవసాయ విద్యుత్ మోటార్ విలువ సుమారుగా 15 వేల పైన ఉందని తెలిపారు.