వ్యాధులు విజృంభించకుండా అప్రమత్తం

వరంగల్‌,ఏప్రిల్‌25 :  రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఈ రెండు నెలలతో పాటు వచ్చే వర్షాకాలంలో కూడా వివిధ రకాల వ్యాధులు  విజృంభించే ప్రమాదం ఉందని అందువల్ల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీనికితోడు జిల్లాలో చలి తీవ్రత కారణంగా  వర్షాకాలంలో ఫ్లూ, మలేరియా తదితర వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటినుంచే అన్ని వ్యాధులకు సన్నద్దం కావాలన్నారు.  ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది జిల్లాను వదిలి వెళ్లకూడదని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కరుణ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం  మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.