వ్యాధుల పై కళాజాత ప్రదర్శన.

జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండలంలోని చింతగుడ గ్రామంలో ఆరోగ్యం పై కళాజాత ప్రదర్శన తెలంగాణ సంస్కృతిక కలబృందం ఆధ్వర్యం లొ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల ఎంపీపీ పంద్ర జైవంత్ రావు పరిశీలింంచి మాట్లాడుతూ వర్షాకాలం వ్యాధుల రాకుండా జాగ్రత్తలు అవసరమని అన్నారు.ఇంటి చుట్టూ పక్కలు మురికి నీటి గుంతలు నీరు నిలువ ఉండకుండా చూడాలని దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు.మంచినీరు తాగాలని ఎలాంటి సమస్యలు ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి లో చూపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కల బృందం సభ్యులు గోవిందరావు మోహన్ నాయక్ శంకర్ ప్రుషోతం రామచంద్ర సర్పంచులు ఆశ వర్కర్లు అంగనవాడి అయలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Attachments area