వ్యాపారి హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల అరెస్టు

ఖమ్మం, జనంసాక్షి: హైదరాబాద్‌లో ఓ వ్యాపారి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ ఆర్మీ జవాను, హౌసింగ్‌ ఉద్యోగితో పాటు మరొకరు ఉన్నారు.  ఆర్మీ జవాను నివాసంలో భారీగా ఆయుధాలతోపాటు, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.