శంభునిపేటలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 18(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం వాగ్బాఠ యోగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని వరంగల్ ఏసిపి గిరికుమార్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి కలిసి 42వ డివిజన్ కార్పొరేటర్ చందన పూర్ణచందర్ గారు ప్రారంభించినారు.
ఈ సందర్భంగా చందన పూర్ణచందర్ మాట్లాడుతూ శంభునిపేట రంగశాయిపేట లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న సంకల్పంతో ఈ యొక్క ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటుచేసిన వాగ్బాఠ యోగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. వరంగల్ లో ఉన్న పదిమంది ప్రముఖమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాగ్బాఠ యోగా వాకర్స్ అసోసియేషన్ కి చెందిన మధుసూదన్, నిరంజన్ రెడ్డి, రాంచందర్, మోహన్, నవీన్ రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
Attachments area