శశిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడు
05 జనం సాక్షి కోటపల్లి
మంచిర్యాల జిల్లా :- కోటపెల్లి మండలం షెట్ పెల్లి గ్రామ పంచాయతీ లో గౌ ” షెట్ పెల్లి సర్పంచ్ ముల్కల్ల ఉమ – శశిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం.సర్పంచ్ గారు మాట్లాడుతు వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు సోకకుండా అందరి
ఇళ్లల్లో మురికి నీరు నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు అందరి ఇళ్లల్లో నీటిని వేడిచేసి చల్లార్చుకొని త్రాగలని చెప్పడం జరిగింది. మరియు షెట్ పెల్లి గ్రామ పంచాయతీ లో మల్టిపర్పస్ వర్కర్లు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం తో వారిని
గ్రామ సభలో తీర్మానం చేసి తీసివేయడం జరిగింది.వారి స్థానంలో కొత్త వారిని నియమించడం జరిగింది ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకర్ గారు ,
ఉపసర్పంచ్ గోనె మోహన్ రెడ్డి , వార్డ్ మెంబర్లు కాపిరపు బాపు , అసంపెల్లి రంభ గారు, ఆశ కార్యకర్తలు , అంగన్వాడీ టీచర్లు , గ్రామ నాయకులు, యూత్ సభ్యులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు