శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ
హైదరాబాద్, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క లేకపోవడంపై పీఏసీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల వ్యవహారంపై పీఏసీ తీవ్రంగా మండిపడింది. దీపం పథకానికి సంబంధించిన కిరోసిన్ పక్కదారి పట్టడంపై పీఏసీ తప్పుపట్టింది. ఈ నెల 22 న సమగ్ర నివేదిక ఇవ్వాలని పీఏసీ అధికారులను ఆదేశించంది. 22న జరిగే సమావేశానికి ఆర్థికశాఖ అధికారులను పిలిపించనుంది.