శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ప్రముఖ శివాలయాలకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లిల్లో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.  కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు శివరాత్రి వేడుకల్లో  ప్రాధాన్యం ఉంది.మంగళవారం మహాశివరాత్రి నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా మహాశివరాత్రి రోజున అభిషేకాలు, శివపార్వతుల కల్యాణం కనుల పండువగా సాగుతాయి. నగరానికి చెందిన భక్తులు శివరాత్రి జాగరణకు హాజరవుతారు. శివలింగానికి అభిషేకం చేస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరి ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హన్మకొండ మండలంలోని భట్టుపల్లి హవేలి కొత్తపల్లిలోని ఫణికల రామప్ప క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. రామప్ప తర్వాత అంతటి పెద్ద శివలింగం ఇక్కడే కొలువుదీరింది. ఆంజనేయస్వామి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు స్థల పురాణాల్లో పేర్కొన్నారు. డోర్నకల్‌ మండలం అమ్మపాలెంలోని శివాలయం కాకతీయుల కాలం నుంచే ప్రసిద్ధి చెందింది. రుద్రమదేవి హయాంలోనే ఈ దేవాలయం ప్రతిష్ఠాపన జరిగింది.  దేవాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తుంటారు. సోమవారం భక్తుల తాకిడి అధికంగా ఉంది.  మహాశివరాత్రి వేడుకలకు దేవాలయం ముస్తాబయ్యింది. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌ వంటి దూర ప్రాంతాల భక్తులు హాజరవుతారు. మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలకు మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. వేకువజామున 4 గంటలకు శివుడికి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కొండపై కొలువుదీరిన స్వయం భూలింగం కాశీ క్షేత్రంలోని శివ లింగాన్ని పోలి ఉండడం వల్ల మెట్టుగుట్టను దక్షిణ కాశీగా పిలుస్తారు. శివాలయాన్ని కాకతీయ రాజులు, వీరభద్రాలయాన్ని చాళుక్యులు నిర్మించినట్లు పూర్వీకుల కథనం. ముఖ్యంగా పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా.. పాపవినాశినిగా పేర్కొంటారు.  ఈ క్షేత్రానికి మహా శివరాత్రి సందర్భంగా లక్షల్లో భక్తులు హాజరవుతారు.  ఇక శివరాత్రి కావడంతో  కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి బ్ర¬్మత్సవాలలో భాగంగా ఐదో ఆదివారం భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రాజగోపురం, గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేయడానికి భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ వర్గాలు అన్ని చర్యలు తీసుకున్నారు. శ్రీమల్లికార్జునస్వామి బ్ర¬్మత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయం తరఫనె నిర్వహించే ‘పెద్దపట్నం’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏ దేవాలయంలో లేని ఈ సరికొత్త సంప్రదాయం ఈ పెద్దపట్నం. ఈ మ¬త్సవాన్ని ఏటా మహాశివరాత్రి నాడు ఆలయం తరఫనె జరిపించడం ఆనవాయితీ.మంగళవారం ఉదయం లింగోద్భవ కాలం 12 గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అర్ధరాత్రి 1.30 గంటలకు శ్రీస్వామివారి సేవ కార్యక్రమాలుంటాయి. అర్ధరాత్రి 2 గంటలకు పెద్దపట్నం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.