శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ధూల్‌పేట్‌లోని మహాకాశేశ్వరి మందిరం నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాంకోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు అశేష భ్తజనంతో ఈ యాత్ర జరగనుంది. శ్రీరామ్‌ యువసేన, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ ఈ యాత్రను సంయ్తుంగా నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఈ యాత్రకు భారీ బందోబస్తు చేపట్టారు.