శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  నాలుగురోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్విని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులు పాపను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన రావుల కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. పాప కిడ్నాప్‌కు కారణాలు తెలియరాలేదని తెలిసింది.