శ్రావణ మాసంలో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి పూజల కోసము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ తీర్మానం
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట జనం సాక్షి జూలై 20
శ్రాణమాసంలో శ్రీ ఉమాసంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు, కొత్తపేట లో నిర్వహించే ప్రత్యేక పూజల కొరకై వచ్చే భక్తుల సౌకర్యార్థం మరియు సౌలభ్యం కొరకు శ్రీ ఉమసంగమేశ్వర సేవా సంఘం అధ్యక్షులు బాపు రాజా గారి అధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశం లో కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక తీర్మానాలు చేశారు.. సమావేశం లో ప్రధాన కార్యదర్శి శంకరయ్య కోశాధికారి రాజశేఖర్ రెడ్డి, కందుకూరి నరసింహులు, ప్రభాకర్ రావు, మురళి గౌడ్, శంకర్ రావు, బెతయ్య, ప్రభువులు . సీతారామ రావు, సతీష్ గౌడ్ పూజారి సంగప్ప మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..




