శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల నవంబర్‌ కోటా విడుదల

తిరుమల,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబర్‌ నెల కోటాలో మొత్తం 67,567 టికెట్లను విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంటాయని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,767 సేవా టికెట్లు విడుదల కాగా, ఇందులో సుప్రభాతం 7,512, తోమాల, అర్చన 200, అష్టదళపాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 2875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 56,800 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 2000, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4050, ఆర్జిత బ్రహ్మూత్సవం 7,425, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 16,200 ఉన్నాయని తెలిపారు.టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో టిక్కెట్ల నమోదుకు నాలుగురోజులపాటు అవకాశం కల్పించారు. అనంతరం లాటరీ పద్ధతిలో సేవా టిక్కెట్లను కేటాయిస్తారు. అద్దె గదులు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది.