శ్రీశైలానికి మరోమారు వరదనీరు చేరిక
కర్నూలు,ఆగస్ట్11(జనం సాక్షి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మరోమారు శనివారం వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ప్లో 20 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ప్లో 30,237 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 869.30అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టిఎంసిలు. ప్రస్తుతం 138 టిఎంసిలుగా నమోదయ్యింది. సుంకేసుల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు డ్యాం మూడు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్‌ప్లో 12 వేలు, ఔట్ ఎ/-లో 13 వేల క్యూసెక్కులుగా ఉంది. కేసీ కాలువకు వేయిక్యూసెక్కుల నీటి అధికారులు విడుదల చేశారు. జురాల నుంచి శ్రీశైలం జలాశయానికి 16,000 క్యూసెక్కులు , సుంకేశుల జలాశయం నుంచి 15,816 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 869.30 అడుగుల గానూ నీటి నిల్వ సామర్థ్యం 138.9520 టీఎంసీలుగా నమోదు అయ్యింది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తికి 2400 క్యూసెక్కుల నీటిని, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కుల నీటిని ,పోతిరెడ్డిపాడుకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతం అయినా సాగర్‌కు కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,446 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.