శ్రీశైల లింగం….. శిరసా స్మరామి.

శ్రీ‌శైల మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు దంపతులు.
తాండూరు అగస్టు 23(జనంసాక్షి)శ్రావణమాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని మంగళవారం తెల్లవారుజామున దర్శించుకోని స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి సన్నిధానంలో ఆలయ అర్చకులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం శ్రవణమాసంలో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందని ,ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అందరికి ఆ భగవంతుడి ఆశిషులు తప్పక ఉండాలని ఆమె పేర్కొన్నారు.మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, సాయిపూర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.