శ్రీ కోదండ రామస్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక
ఆలయ కమిటీ అధ్యక్షునిగా బళ్లారి నాగేష్
లింగాల జనం సాక్షి ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల కేంద్రంలోని అతి పురాతనమైన చోళుల కాలంలో నిర్మించిన ఎంతో ప్రశస్థి గల పురాతన ఆలయమైన శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి సర్పంచ్ కోనేటి తిరుపతయ్య సమక్షంలో నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా బళ్లారి నాగేశ్వర్, గౌరవ అధ్యక్షులుగా ఐఆర్ఎస్ మొగిలి మోహన్ బాబు, సిఐ కావేటి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ బళ్లారి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కంచరి మురళి చారి, కందూరి శ్రీనివాసులు, కోశాధికారిగా బళ్లారి రామరాజు, పూజారి భాస్కర్, ఉపాధ్యక్షులుగా మాకం సుధాకర్, పూజారి బుడ్డయ్య, పూజారి పరమేశ్వర్, బొజ్జ గాని వెంకటేష్, రంగా గోవర్ధన్, వార్డ్ మెంబర్ రామకృష్ణ, బాలాజీ నాయక్ వల్వాయి ు సురేందర్ ,పోల శ్రీను, నల్లగొండ పెంటయ్య, నల్లగొండ ప్రణయ్, ఉప్పరి శివ, రంగా హరిబాబు, కార్యదర్శిలుగా నాయకపు వీరాస్వామి, కొండేమోని సత్యం, జెసిబి శ్రీనివాసులు, బుడ్డయ్య యాదవ్, పల్లె మహేష్, బళ్లారి జనార్ధన్, బళ్ళారి తిరుపతయ్య, గుంపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శులుగా ప్యారం నాగార్జున, ప్రశాంత్ ,మల్లె ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా 13 మందిని అలాగే 37 మందిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బళ్లారి నాగేశ్వర్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను విస్మరించకుండా అందరిని సమన్వయ పరుస్తూ ఎంతో చరిత్ర గల శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుపరచుటకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నూతనంగా ఏర్పడిన కమిటీలో అన్ని వర్గాలకు, కులాలకు సమ ప్రాధాన్యత కల్పించడం జరిగిందని తెలిపారు. జాతర ఉత్సవాలకు తోడ్పాటు అందించేందుకు ముస్లిం మైనార్టీ యూవకులైన అబ్దుల్లా, ఇమ్రాన్, మన్నన్, సమీర్, అత్త ఉల్లా, మాసూం, సుబహాన్ ,వాజీదులు ముందుకు రావడం ఆదర్శనీయమని అన్నారు.